కడప జిల్లా వైఎస్సార్ ఫ్యామిలీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. ఎప్పుడు ఎన్నికలు జరిగిన జిల్లాలో వైఎస్సార్ ఫ్యామిలీ హవానే ఉంటుంది. గతంలో వైఎస్సార్ ఉన్నప్పుడు జిల్లాలో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు దక్కించుకునేది. ఇక జగన్ ఎంట్రీ ఇచ్చాక, జిల్లాలో వైసీపీ జెండా ఎగురుతుంది. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్నా సరే జిల్లాలో వైసీపీ సత్తా చాటింది. మొత్తం 10 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 9 గెలిస్తే, టీడీపీ 1 గెలిచింది. 2019 ఎన్నికల్లో అయితే వైసీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది.