రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రోజా అనిపించుకోడానికి చాన్నాళ్లు ఎదురుచూశారామె. తీరా ఎమ్మెల్యే అయినా పార్టీ అధికారంలోకి రాకపోవడంతో అప్పట్లో ఐరన్ లెగ్ అనే కామెంట్లు కూడా వినాల్సి వచ్చింది. ఈ దఫా రోజా గెలవడం, పార్టీ అధికారంలోకి రావడం రెండూ జరిగాయి. అయితే రోజాకు మంత్రి పదవి మాత్రం రాలేదు. తొలి విడత సరే, మలి విడతలో అయినా ఆ అదృష్టం రోజాకు ఉందా అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.