ఆనందయ్యకు అండగా నిలవాలని టీటీడీ భావిస్తోంది. కరోనాకు విరుగుడుగా దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం జరుగుతున్న కృష్ణపట్నం ఆనందయ్య అందిస్తున్న ఆయుర్వేద వైద్యంపై తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టి సారించింది. ఒకవేళ కేంద్ర ఆరోగ్యశాఖ బృందాల నుంచి ఆనందయ్య ఔషధానికి అనుమతులు లభిస్తే... భారీగా మందును ఉత్పత్తి చేసేందుకు సహకరించాలని నిర్ణయించింది.