ఏపీ, తెలంగాణ సరిహద్దులో గందరగోళం.ఏపీ నుంచి రాకుండా, వెళ్లకుండా వాహనాలు అడ్డుకుంటున్నారని.. బోర్డర్ లో ట్రావెల్ టెన్షన్ ఉందని.. వాహనదారులపై మళ్లీ లాఠీచార్జ్ చేస్తున్నారని దేవినేని ఉమ అన్నారు. ప్రభుత్వాల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నారని.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, ఎందుకు మాట్లాడ లేకపోతున్నారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.