తన వ్యాఖ్యలపై అంతటా విమర్శలు రావడంతో రాందేవ్ బాబా మేలుకున్నారు. కేంద్ర మంత్రి లేఖతో దిగొచ్చారు. అల్లోపతి వైద్యంపై తాను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకొంటున్నానన్నారు. అన్నిరకాల వైద్యాలను తాను గౌరవిస్తానని.. ముఖ్యంగా అల్లోపతి ఎంతోమంది జీవితాలను కాపాడుతోందని ప్లేటు ఫిరాయించేసి లెంపలేసుకున్నారు.