ఆనందయ్య మందును ఐసీఎంఆర్, ఆయుర్వేద నిపుణులు పరిశీలిస్తున్నారు. ఈ మందు కోసం రోగులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు వారికి ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ఆయుష్ కమిషనర్ ఇచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో అనందయ్య తయారుచేస్తున్న మందు పంపిణీకి అభ్యంతరం లేదని ఏపీ సర్కారు ప్రకటించింది.