జగన్ దెబ్బకు ఏపీలో టీడీపీ పరిస్తితి మరీ ఘోరంగా తయారైన విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలోనే జగన్ సునామీలో చాలామంది తమ్ముళ్ళు సైడ్ అయిపోయారు. అలాగే మరికొందరు ఫ్యాన్ గాలి కోసం వైసీపీలోకి వచ్చేశారు. దీంతో రాష్ట్రంలో పలు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో టీడీపీని నడిపించే నాయకుడే కరువైపోయారు. ముఖ్యంగా ఒంగోలు, నెల్లూరు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీకి సరైన నాయకుడు లేరు.