జూపూడి ప్రభాకర్...ఏపీ రాజకీయాల్లో సుపరిచితమైన పేరు. ముఖ్యంగా జూపూడి పేరు చెబితే వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడు అని గుర్తొస్తుంది. కానీ జూపూడి ఆ విధేయతని పూర్తిగా నిలుపుకోలేదు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితం మొదలుపెట్టిన జూపూడి, వైఎస్సార్‌కు బాగా సన్నిహితంగా ఉండేవారు. అయితే వైఎస్సార్ చనిపోయాక, వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉండేవారు. ఆయనకు ఎప్పుడు సపోర్ట్‌గా ఉండేవారు. చివరికి అక్రమాస్తుల కేసులో సిబిఐ, జగన్‌ని అరెస్ట్ చేసేటప్పుడు కూడా జూపూడి, ఆయన ఇంటి దగ్గరే ఉన్నారు.