పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూశాక, ఏపీలో పూర్తిగా వైసీపీ డామినేషన్ ఉందని అర్ధమైపోతుంది. అసలు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట కూడా వైసీపీ సత్తా చాటిందంటే, ఏ స్థాయిలో అధికార పార్టీ బలం పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే స్ట్రాంగ్‌గా ఉన్న మండపేట నియోజకవర్గంలో సైతం ఫ్యాన్ గాలి వీచింది.