తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వీక్ అవ్వడంతో, ఆ స్థానాన్ని భర్తీ చేయాలని కమలదళం చూస్తుంది. అందుకు తగ్గట్టుగానే రాజకీయం చేస్తుంది. అలాగే ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ సత్తా చాటింది. అధికార టీఆర్ఎస్ని ఓడించి సంచలనం సృష్టించింది. అటు జిహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆర్ఎస్కు దాదాపు చెక్ పెట్టినంత పని చేసింది.