చంద్రబాబు, లోకేష్ సహా ఇతర నేతలంతా జగన్ ని ప్రతిరోజూ విమర్శిస్తున్నవారే. కానీ ఎప్పుడూ జగన్ ప్రతిపక్షాల విమర్శలకు స్పందించలేదు. వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు కానీ, జగన్ ఇంకా రంగంలోకి దిగలేదు. అంటే ఒకరకంగా ప్రతిపక్షాలను ఆయన పూర్తిగా విస్మరించారనే చెప్పాలి. అదే సమయంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగకుండా చూసుకుంటున్నారు. ప్రతి నెలా ఏదో ఒక పథకం రూపంలో ప్రజలకు ఆర్థిక సాయం అకౌంట్లలో జమ చేస్తున్నారు. ఇదంతా ఒకరకంగా టీడీపీకి ఇబ్బందిగా మారింది. 2024 ఎన్నికలకు ప్రభుత్వాన్ని ఎలా విమర్శించాలి, ఏ విషయాలపై నిలదీయాలి.. అనేదానిపై కసరత్తులు చేస్తున్నారు.