ఇప్పటికే దేశంలో కరోనా బీభత్సంతో ప్రజలు వణికిపోతుంటే మరోవైపు ఎల్లో ఫంగస్, వైట్ ఫంగస్ అంటూ పేర్లు పెట్టి ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా. వాస్తవానికి ఇవేమీ ప్రాణాంతకమైన ఫంగస్ లు కావని, ఫంగస్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగులో ఉంటుంది అని స్పష్టం చేశారు.