తుమ్మల నాగేశ్వరరావు..తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. గతంలో టీడీపీలో తుమ్మల కీలకపాత్ర పోషించారు. అయితే తెలంగాణ ఏర్పాడ్డాక, రాష్ట్రంలో టీడీపీ పరిస్తితి మరీ ఘోరంగా తయారైంది. అలాంటి పరిస్తితుల్లోనే 2014 ఎన్నికల్లో తుమ్మల ఖమ్మం ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఓడిపోయాక కేసీఆర్ ఆహ్వానంతో టీఆర్ఎస్లో చేరారు. అలాగే 2016 పాలేరు ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరుపున పోటీ చేసి గెలిచారు. అదేవిధంగా కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు.