తోట త్రిమూర్తులు తూర్పు గోదావరి రాజకీయాల్లో బలమైన నాయకుడు. జిల్లాలో ఈయనకు బాగానే ఫాలోయింగ్ ఉంది. ఈయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి కాస్త అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఈయన రాజకీయ జీవితం మొదలుపెట్టింది టీడీపీలోనే. 1994 ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి ఇండిపెండెంట్గా గెలిచిన తోట, తర్వాత టీడీపీలోకి వచ్చేశారు. ఇక 1999 ఎన్నికల్లో తోట టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.