కృష్ణపట్నం ఆనందయ్య తో చర్చలు జరిపిన వైసీపీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి.. నిపుణుల బృందం నివేదికలు సమర్పించి, ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే మందు పంపిణీ ప్రారంభిస్తామని ప్రకటించారు. ఆనందయ్య ఆయుర్వేద మందును చాలామంది కోరుకుంటున్నారని... అవసరమైన మేర మందు తయారీకి సిద్ధంగా ఉన్నామని కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.