ఇప్పుడు టీకాలపై ఓ వార్త సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది. కరోనా టీకాలు వేయించుకున్న వారంతా రెండేళ్లలో తప్పకుండా మరణిస్తారని ప్రఖ్యాత సైంటిస్ట్, నోబెల్ బహుమతి గ్రహీత లూక్ మాంటెగ్నీర్ చెప్పినట్టు వచ్చిన వార్త కలకలం సృష్టించింది. ఈ సైంటిస్టుకు చాలా పేరుంది. ఎయిడ్స్ వ్యాధి పరిశోధనలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. అలాంటి వ్యక్తి ఇలా చెప్పడంతో టీకా తీసుకున్న వ్యక్తుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి.