కడప జిల్లా అంటే వైఎస్సార్ ఫ్యామిలీ అడ్డా అని స్ట్రాంగ్‌గా చెప్పొచ్చు. వైఎస్సార్ ఉన్నప్పుడు జిల్లాలో కాంగ్రెస్ సత్తా చాటేది. ఇక జగన్ వచ్చాక జిల్లా వైసీపీ వశమైపోయింది. ఇక్కడ టీడీపీ పరిస్తితి ఎప్పుడు ఘోరంగానే ఉంటుంది. అంతకముందు జిల్లాలో ఒకటి, రెండు సీట్లు గెలుచుకునేది. కానీ 2019 ఎన్నికల్లో ఒక సీటు గెలుచుకోలేదు. భవిష్యత్‌లో కూడా జిల్లాలో టీడీపీ జెండా ఎగరడం కష్టమనే చెప్పొచ్చు.