నారా లోకేష్...టీడీపీకి భవిష్యత్ నాయకుడు. చంద్రబాబు తర్వాత టీడీపీని నడిపించేది లోకేష్ అని ఇప్పటికే అందరికీ అర్ధమైపోయింది. అందుకే గత కొంతకాలంగా రాజకీయాల్లో దూకుడు ప్రదర్శిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి చంద్రబాబుతో పాటు పార్టీని పైకి లేపడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే గతం కంటే భిన్నంగా చినబాబు తన వంటితీరు, మాటతీరు రెండు మార్చుకున్నారు.