గౌరు చరితా రెడ్డి...ఈ పేరు చెప్పగానే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తొస్తారు. ఎందుకంటే చరితా రెడ్డిని తోబుట్టవులా చూసిన నాయకుడు వైఎస్సార్. చరితా రెడ్డి భర్త గౌరు వెంకటరెడ్డి జైలుకు వెళ్లిన సమయంలో వైఎస్ ఆ కుటుంబానికి అండగా నిలిచారు. అలాగే 2004 ఎన్నికల్లో చరితారెడ్డికి నందికొట్కూరు టిక్కెట్ ఇచ్చారు.