హిందూపురం అంటే నందమూరి ఫ్యామిలీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. టీడీపీ ఆవిర్భావించిన దగ్గర నుంచి ఇక్కడ పసుపు జెండా ఎగురుతూనే ఉంది. అలాగే ఈ నియోజకవర్గం నందమూరి ఫ్యామిలీకి కలిసొచ్చింది. ఇక్కడ నుంచి ఎన్టీఆర్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా, ఒకసారి హరికృష్ణ విజయం సాధించారు. అలాగే గత రెండు పర్యాయాలు హిందూపురంలో నందమూరి బాలకృష్ణ గెలుస్తున్నారు.