ప్రస్తుత తెలంగాణ రాజకీయాలలో ఈటల ఎపిసోడ్ హైలైట్ అని చెప్పవచ్చు. ఒక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ పై భూ కబ్జా వివాదం చుట్టుముట్టడంతో కొన్ని రోజుల్లోనే అతని రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ మానసికంగా బలమైన నాయకుడు కావడంతో అంత ఈజీగా ప్రతికూల పరిస్థితులకు తలొగ్గలేదు.