బ్లాక్ ఫంగస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టాలంటే, విచ్చలవిడి స్టెరాయిడ్స్ వాడకం తగ్గాలి, అంటే కరోనా చికిత్సలో వాటి వాడకం తగ్గాలి, అది జరగాలంటే కరోనా కేసులు కూడా తగ్గాలి. ప్రస్తుతం కేసుల వ్యాప్తి తగ్గుదున్న దృష్ట్యా.. కరోనాతోపాటే, బ్లాక్ ఫంగస్ కూడా త్వరలోనే తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు వైద్యులు. చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ చేసిన అధ్యయనంలో కరోనా చికిత్సలో 63శాతం మంది రోగులు అవసరానికి మించి స్టెరాయిడ్స్ వాడారని, వీరిపై పలు దుష్ప్రభావాలు కనిపించాయని తేలింది. ఈ దుష్ప్రభావాల్లో ఒకటి బ్లాక్ ఫంగస్.