కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్.. ఏడాది లెక్కలను ఈ కాగ్ మదింపు చేస్తుంది. ప్రభుత్వం రాబడి, వ్యయం తీరుతెన్నులను విశ్లేషిస్తుంది. తప్పు ఒప్పులను నిర్భయంగా బయటపెడుతుంది. అందుకే కాగ్ నివేదిక అంటే ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టే పత్రం అన్నమాట. గత ఆర్థిక ఏడాది బడ్జెట్ అంచనాలు.. వాస్తవానికి ఖర్చు చేసిన తీరు, రాబడి వివరాలు పరిశీలిస్తే తెలంగాణ సర్కారుకు మంచి మార్కులే పడతాయి.