ప్రతిపక్ష టీడీపీలో చాలామంది ఫైర్ బ్రాండ్ నాయకులు ఉన్న సంగతి తెలిసిందే. తమ పార్టీనిగానీ, తమ అధినేత చంద్రబాబుపై గానీ ప్రత్యర్ధులు విమర్శలు చేస్తే వెంటనే స్పందిస్తూ వారికి కౌంటర్లు ఇచ్చేయడంలో ఫైర్ బ్రాండ్ నాయకులు ముందుంటారు. అలా టీడీపీలో ఉన్న ఫైర్ బ్రాండ్ నాయకుల్లో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఒకరు. ఎలాంటి పరిస్తితుల్లోనైనా సరే పార్టీ తరుపున పోరాడుతూ, అధికార వైసీపీపై విరుచుకుపడే నేత బుద్దా.