ఏపీలో ఇప్పటికీ చాలామంది ఎమ్మెల్యేలు జగన్ ఇమేజ్ మీద ఆధారపడి ఉన్నారా? జగన్ బొమ్మ లేకపోతే వారికి గెలుపు కష్టమా? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్తితులని చూస్తే అదే నిజం అనిపిస్తుంది. గత ఎన్నికల్లోనే మెజారిటీ ఎమ్మెల్యేలు కేవలం జగన్ ఇమేజ్ మీదే గెలిచారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. అతి తక్కువ మంది మాత్రమే సొంత ఇమేజ్‌తో పాటు, జగన్ ఇమేజ్ కలిసిరావడంతో విజయాలు అందుకున్నారు.