సమరసింహారెడ్డి....తెలుగు చిత్రసీమలో చిరస్థాయిగా గుర్తుండిపోయే చిత్రం. నందమూరి బాలకృష్ణ జీవితంలో అతిపెద్ద మైలురాయి. ఇక అలాంటి చిత్రాన్ని నిర్మించిన చెంగల వెంకట్రావు ఇప్పుడు అడ్రెస్ లేకుండా పోయారు. సమరసింహారెడ్డి హిట్ ఇవ్వడంతో బాలయ్య సిఫార్సు చేసి మరీ 1999 ఎన్నికల్లో చెంగలకు పాయకరావుపేట టీడీపీ టిక్కెట్ వచ్చేలా చేశారు.