ప్రస్తుతం కరోనాకు వ్యాక్సీన్ వచ్చేసింది. ఈ ఏడాది చివరి నాటికి అందరికీ వ్యాక్సిన్ ఇస్తామంటున్నారు. అందుకే బహుశా.. ఓ రెండేళ్లలో ప్రపంచానికి ఈ కరోనా పీడ విరగడ అవ్వొచ్చేమో అని చాలామంది భావిస్తున్నారు. కానీ.. ఈ మాయదారి కరోనా మనల్ని ఇప్పట్లో వదిలి వెళ్లదట. అంతే కాదు.. మనతోనే కొన్ని తరాల పాటు కరోనా ప్రయాణం చేస్తుందట.