ఈటల చేరికపై బీజేపీ నేత ఇనుగాల పెద్దిరెడ్డి అభ్యంతరం చెప్పారు. ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈటల బీజేపీలోకి రావడంతో ఆయన అవకాశాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. దీంతో ఆయన మీడియా ముందుకు వచ్చి.. ఈటల బీజేపీలో చేరితే పార్టీలో ఉప్పెన వస్తుందని ప్రకటించారు.