ఎన్టీఆర్కు భారత రత్న కోసం మెగాస్టార్ చిరంజీవి కూడా గళం కలిపారు. ఇవాళ ఎన్టీఆర్ 99 వ జయంతి సందర్భంగా చిరంజీవి ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. ఆయన నూరో జయంతి దగ్గరపడుతున్న వేళ ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గతంలో భూపేన్ హజారికాకు మరణానంతరం ఇచ్చినట్టు ఎన్టీఆర్ కు కూడా మరణానంతరం భారత రత్న ఇవ్వాలని కేంద్రానికి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.