కరోనా సమయం కావడంతో ఇప్పుడు ఏ పని అయినా ఆన్లైన్లోనే చేసుకోవాల్సి వస్తుంది. ఆఖరికి రాజకీయాలు కూడా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో ప్రతిపక్ష టీడీపీ ఆన్లైన్ పార్టీగా మారిపోయింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఏదైనా సరే జూమ్ యాప్‌లోనే పెట్టుకుంటున్నారు. పార్టీ సమావేశాలు, మీడియా సమావేశాలు, నిరసన దీక్షలు ఇలా ప్రతిదీ ఆన్లైనే.