ఏపీలో చాలా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీడీపీకి సరైన నాయకత్వం లేదు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక పలువురు నాయకులు టీడీపీకి దూరంగా జరిగారు. అలాగే మరికొందరు నాయకులు టీడీపీని వీడి వైసీపీ, బీజేపీల్లోకి వెళ్ళిపోయారు. ఇంకొందరు నాయకులు రాజకీయాల్లోనే కనిపించడం లేదు. ఇలా నాయకులు హ్యాండ్ ఇచ్చేయడంతో రాష్ట్రంలో పలు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో టీడీపీకి దిక్కు లేకుండా పోయింది.