తెలుగు గడ్డపై ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా ఉన్నంత కాలం, ఆయనకు చంద్రబాబు పొడిచిన వెన్నుపోటు కూడా చిరస్థాయిగానే గుర్తుండిపోతుంది. ఎవరైనా మర్చిపోయినా సరే చంద్రబాబు ప్రత్యర్ధులు గుర్తు చేస్తూనే ఉంటారు. ఇప్పటికీ అదే వెన్నుపోటుపై ప్రత్యర్ధి పార్టీలు రాజకీయం చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్కు నివాళులు అర్పించే పనిలో ఉంటే, ప్రత్యర్ధి పార్టీ నాయకులు, మీడియా సంస్థలు చంద్రబాబు, ఎన్టీఆర్కు పొడిచిన వెన్నుపోటుపై రాజకీయం చేసే పనిలో ఉన్నాయి.