కడప జిల్లా అంటే వైసీపీ అడ్డా అనే సంగతి తెలిసిందే. ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గం వైసీపీ కంచుకోటగా ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలోని 10 సీట్లు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. అయితే క్లీన్‌స్వీప్ చేసిన సరే ఈ జిల్లాకు ఒక్క మంత్రి పదవే దక్కింది. సీఎం జగన్ పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డిని పక్కనబెడితే, కడప జిల్లా నుంచి షేక్ అంజాద్ బాషా కేబినెట్లో ఉన్నారు.