తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రైతుబంధు సొమ్మును జూన్ 10 నుంచి 25లోగా రైతులందరి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్ పదో తేదీని గడువుగా పెట్టుకుని అప్పటివరకూ రెవెన్యూ భూ ఖాతాల్లో పార్ట్ బీ నుంచి పార్ట్ ఏ లోకి పేర్లు మారిన రైతులందరికీ ఈ సొమ్ము వేయాలని కేసీఆర్ ఆదేశించారు.