జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తి అయింది. ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేసి రెండేళ్ళు ముగిసిన సందర్భంగా వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే, టీడీపీ నేతలు మాత్రం జగన్ పాలనపై విరుచుకుపడుతున్నారు. జగన్ విధ్వంసం మొదలై రెండేళ్ళు అయిందని మండిపడుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలు సంతృప్తిగా లేరని, ప్రతిదీ విధ్వంసం చేసుకుంటూ పాలన చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.