జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తి అయింది. అంటే మరో ఆరు నెలల్లో మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారు. జగన్ అధికారంలోకి రాగానే ఒకసారే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని పాలన మొదలుపెట్టారు. అయితే అప్పుడు మంత్రులుగా అవకాశం రానివారికి రెండున్నర ఏళ్లలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ ఇస్తానని చెప్పారు. దాని ప్రకారం చూసుకుంటే ఈ ఏడాది చివరిన మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరగనున్నాయి.