2014 తెలుగుదేశం పార్టీకి కలిసొచ్చిన సంవత్సరం. దాదాపు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, 2014లో గెలిచి మూడోసారి సీఎం అయ్యారు. అయితే కొత్త రాష్ట్రం, రాజధాని కూడా లేదు. దీంతో రాష్ట్రాన్ని బాబు బాగు చేసేస్తారని అంతా భావించారు. పైగా బీజేపీతో పొత్తులో ఉండటంతో కేంద్రంలో చక్రం తిప్పి రాష్ట్రాన్ని పైకి లేపుతారని అనుకున్నారు. కానీ ఐదేళ్ల కాలంలో అదేమీ జరగలేదు. కానీ చంద్రబాబు, టీడీపీ నాయకులు మాత్రం జనాలకు ఆకాశంలో చుక్కలు చూపించారు.