ఆనందయ్య ఓ వీడియో రిలీజ్ చేశారు. తనను ఎవరూ రహస్య ప్రాంతానికి తరలించలేదని ఆయన ఆ వీడియోలో స్పష్టం చేశారు. తన మందు కోసం జనం ఎక్కువగా వస్తున్నందువల్ల పోలీసుల సూచనల మేరకు తానే అజ్ఞాతంలోకి వచ్చానని ఆయన చెప్పారు. ప్రభుత్వం తనకు అన్ని విధాలా సహకరిస్తుందని.. తనను అరెస్టు చేశారని.. ఇతర ప్రాంతాలకు తరలించారని వస్తున్న వార్తలన్నీ అబద్దమని ఆయన కొట్టిపారేశారు.