ఏపీలో కులాల ఆధారంగానే రాజకీయాలు జరుగుతాయనే సంగతి తెలిసిందే. అది కూడా కమ్మ, రెడ్డి సామాజికవర్గాల మధ్యే ఎక్కువ ఆధిపత్య పోరు నడుస్తుంటుంది. టీడీపీలో కమ్మ సామాజికవర్గం నేతల హవా ఎక్కువగా ఉంటే, వైసీపీ రెడ్డి నాయకుల డామినేషన్ ఉంటుంది. అయితే వైసీపీ గురించి కాసేపు పక్కనబెడితే, దశాబ్దాల కాలం నుంచి టీడీపీలో కమ్మ నాయకుల ఆధిపత్యం కొనసాగుతుంది.