ఏపీలో సైకిల్ స్పీడును పెంచాలనే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గతేడాది పార్లమెంట్ స్థానాల వారీగా టీడీపీ అధ్యక్షులని నియమించారు. ఒకో పార్లమెంట్ స్థానానికి ఒకో అధ్యక్షుడుని పెట్టి పార్టీని బలోపేతం చేయడానికి ప్లాన్ చేశారు. అయితే అధ్యక్షులని పెట్టి 10 నెలలు అయిపోతుంది. ఇక ఈ పది నెలల కాలంలో ఏ ఒక్క పార్లమెంట్ స్థానంలో కూడా టీడీపీ పుంజుకున్నట్లు కనిపించడం లేదు. టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నట్లు లేరు.