గుంటూరు జిల్లా వినుకొండలో రాజకీయాలు వేడెక్కాయి. గత కొన్నిరోజులుగా వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, టీడీపీ నేత జీవీ ఆంజనేయులు మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. కరోనా రోగులకు ఉచితంగా ఆహారం అందిస్తున్న శివశక్తి సంస్థని ఎమ్మెల్యే అడ్డుకోవడంతో అసలు సమస్య మొదలైంది. అయితే ఇటీవల వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనం పంపిణీ చేస్తున్నారు. అయితే తక్షణమే శివశక్తి ఫౌండేషన్ సభ్యులను భోజనం పంపిణీ నిలిపివేయాలని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఆదేశించారు. ఎమ్మెల్యే చెప్పిందే తడవుగా పోలీసులు వెళ్లి భోజనం పంపిణీ చేస్తున్న వారిని అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. భోజనం పంపిణీ చేస్తున్న వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.