ఏపీలో అధికార వైసీపీ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతున్న కూడా వైసీపీ ఆధిక్యం ఏ మాత్రం తగ్గలేదని ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికలు రుజువు చేశాయి. అటు ప్రతిపక్ష టీడీపీ ఏ మాత్రం పుంజుకోలేదని తెలుస్తోంది. ఏ ఒక్కచోట కూడా టీడీపీ, వైసీపీకి పోటీ ఇవ్వలేకపోయింది. వైసీపీ హవా ముందు టీడీపీ తేలిపోతుంది. ఇదే సమయంలో కొన్నిచోట్ల జనసేన వల్ల టీడీపీకి ఇబ్బందులు ఉన్నాయని తెలుస్తోంది.