దివంగత గాలి ముద్దుకృష్ణమనాయుడు...దశాబ్దాల పాటు ఏపీ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన నాయకుడు. తెలుగుదేశం పార్టీలో అనేక ఏళ్ళు పని చేసిన నేత. పలుమార్లు ఎమ్మెల్యేగా సేవలందించారు. అయితే అలాంటి సీనియర్ నాయకుడుకు రోజా చెక్ పెట్టేశారు. గతంలో రోజా టీడీపీలో పనిచేసిన విషయం తెలిసిందే. 2004లో నగరి నుంచి, 2009లో చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.