అనంతపురం జిల్లా....తెలుగుదేశం పార్టీకి కలిసొచ్చే జిల్లా. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లా ఎప్పుడు టీడీపీకి అనుకూలంగానే ఉంటూ వచ్చింది. ప్రతి ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి మంచి ఫలితాలే వచ్చేవి. అయితే 2019లో మాత్రం జగన్ వేవ్‌లో సైకిల్ కొట్టుకుపోయింది. జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ సీట్లలో వైసీపీ 12 గెలిస్తే, టీడీపీ 2 మాత్రమే గెలిచింది. అటు రెండు ఎంపీ సీట్లు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి.