గోరంట్ల మాధవ్....రాజకీయాల్లో ఎక్కువ వివాదాల్లో ఉంటున్న నాయకుడు. గతంలో పోలీసు అధికారిగా పనిచేసిన మాధవ్, అప్పుడు అనంతపురం టీడీపీ ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డితో కయ్యం పెట్టుకున్న విషయం తెలిసిందే. చాలారోజులు వీరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక 2019 ఎన్నికల ముందు మాధవ్ పోలీసు ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. వైసీపీలో చేరి హిందూపురం ఎంపీగా బరిలో దిగారు.