తమ పార్టీలోకి వచ్చేవారు పదవులకు రాజీనామా చేసి రావాలని జగన్ మొదట నుంచి రూల్ పెట్టుకుని ముందుకెళుతున్న విషయం తెలిసిందే. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. వైసీపీ ద్వారా గెలిచి పదవులకు రాజీనామా చేయకుండా టీడీపీలోకి వెళ్లారు. అందులో నలుగురు మంత్రులుగా కూడా పనిచేశారు.