ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య ఎప్పుడు మాటల యుద్ధం జరుగుతుందనే సంగతి తెలిసిందే. అయితే నిత్యం ఈ రెండు పార్టీల మధ్య ఏదొక రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఇక ప్రతిరోజూ ఏ వైసీపీ నాయకుడు చంద్రబాబుపై విమర్శలు చేసిన, చేయకపోయిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాత్రం నిత్యం బాబు టార్గెట్గా విమర్శలు చేస్తారు. సోషల్ మీడియా వేదికగా బాబుపై సెటైర్లు వేస్తుంటారు.