రాష్ట్రం విడిపోయాక ఏపీకి రాజధాని లేని సంగతి తెలిసిందే. అయితే 2014లో గెలిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కొన్ని రోజులు హైదరాబాద్ నుంచే పాలన చేసి, తర్వాత విజయవాడ వచ్చేసి రాజధాని ఏర్పాటుని స్పీడ్ చేశారు. ఆ క్రమంలోనే రాష్ట్రానికి మధ్యలో ఉంటుందని అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారు. అలాగే రైతుల నుంచి 33 వేల ఎకరాలు భూములు సమీకరించారు. ఇక అక్కడ నుంచి రాజధాని విషయంలో బాబు పెద్ద పెద్ద గ్రాఫిక్స్ బొమ్మలు చూపించారు. దీంతో జనం సంబరపడిపోయారు. తాత్కాలికంగా కొన్ని భవనాలు కట్టారు.