మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట మరో విషాదం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు రవీంద్రనాథ్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదరాబాద్ లో కన్నుమూశారు. కొద్ది కాలం క్రితమే మాగంటి బాబు ప్రధమ కుమారుడు రాంజీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ విషాదం నుంచి కోలుకోక ముందే మాగంటి కుటుంబం మరోసారి విషాదంలో కూరుకుపోయింది.