డీఆర్డీవో తయారు చేసిన 2డీజీ ఔషధం పౌడర్ రూపంలో వస్తుండే సరికి.. వినియోగం సులువుగా ఉంటుందని, కరోనాని తరిమేసే సంజీవని వచ్చిందని అందరూ సంబరపడ్డారు. యాంటాసిడ్ ద్రావణం తాగినట్టు తాగేస్తే శరీరంలో వైరస్ పెరగడం ఆగిపోతుందని, తద్వారా కరోనా తగ్గిపోతుందని భావించారు. కానీ 2డీజీ జనసామాన్యంలోకి వచ్చేందుకు మరింత సమయం పట్టేలా ఉంది. ప్రస్తుతానికి ఆస్పత్రుల్లోనే ఈ మందు వినియోగిస్తున్నారు. తాజాగా దీని వాడకంపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది డీఆర్డీవో.